ఒంగోలు : ఒంగోలు పురపాలక సంఘం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకలలో భాగంగా ఆదివారం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ఈ వాక్ లో రాజకీయాలకతీతంగా డాక్టర్లు, ఇంజనీర్లు, ఉద్యోగులు, యువత, విద్యార్థులు, మహిళలు, ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ .. ..ఒంగోలు సుందరీకరణలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, ఒంగోలు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్ రాజాబాబు, మున్సిపల్ కమిషనర్ ల కృషి ఎంత ఉందన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఒంగోలు ను నమ్ముకుని ఒంగోలుకు వచ్చి నివాసాలలో ఏర్పాటు తెచ్చుకుంటున్నారని. ఇదంతా దామచర్ల చేస్తున్న అభివృద్ధిపై ఉన్న నమ్మకంతోనే ప్రజలు వస్తున్నారని పేర్కొన్నారు. 150 సంవత్సరాల వేల్పులలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ ……ఒంగోలు 150 సంవత్సరాల చరిత్ర తెలిసేలా వాక్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ముగింపు ఉత్సవాలలో భాగంగా ఈనెల 30వ తేదీన నిర్వహించే వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, వైస్ గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రి అలాగాని సత్యప్రసాదులతోపాటు రాష్ట్రంలోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. అలాగే ఈ సందర్భంగా 80 నుండి 80 జతల ఒంగోలు జాతి గిత్తల ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పరిశీలించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాలలో ప్రజలు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీలు వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు.










