తాళ్లూరుః తెలుగు దేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా తెలుగు రైతు అధ్యక్షుడు కైపు రామకోటి రెడ్డి సతీమణి కైపు నాగలక్ష్మి గురువారం ఒంగోలులో నామినేషన్ దాఖలు చేసారు. పార్టీ అభ్యున్నతికి చిరకాలంగా కృషి చేస్తున్న రామకోటి రెడ్డి కి జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేయటానికి పార్టీ అధిష్టానం కేటాయించటాన్ని తెలుగు దేశం పార్టీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మాజీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు గొల్లపూడి వేణుబాబు, క్లస్టర్ ఇన్చార్జి కైపు నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: