తాళ్లూరు: స్థానిక ఎన్నికల నేపథ్యంలో గురువారం తాళ్లూరు మండలంలో వివిధ ప్రాదేశికాల నుంచి 11 టిడిపి పార్టీ బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆ౦ దేవసహాయం తెలిపారు. అందులో తాళ్లూరు-1, దోనకాయల పాడు, బొద్దికూరపాడు నుండి రెండు నామినేషన్లు, వెలుగు వారి పాలెం, తురకపాలెం, మన్నేపల్లి, మాధవరం, తూర్పుగంగవరం ల నుండి ఒక్కోక్క నామినేషన్లు దాఖలు చేసారు. అందులో మహిళలు అభ్యర్థులు ఏడుగురు పురుష అభ్యర్థులు నలుగురి నామినేషన్లు దాఖలు చేసారు.
వైసీపీ అభ్యర్థుల నామినేషన్ సమయంలో ఘర్షణ ..
వైసీపీ అభ్యర్థులు మధ్యాహ్నం తరువాత నామినేషన్లు వచ్చు సమయంలో టిడిపి, వైసీపీ మద్దతు దారుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ముందుగా వైసీపీ చెందిన మహిళలు తమ మద్దతు దారులను ఎందుకు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని, చేతనైతే నామినేషన్ వేయించి తర్వాత బలా బలాలు గెలుపు రూపంలో తెల్చుకోవాలని కోరారు. ఈనేపధ్యంలో ఇరు వర్గీయులు తోపులాటలు జరిగి, ఘర్షణ ఏర్పడటంతో పలువురికి స్వల్ప గాయాలు తగిలాయి. నామినేషన్ సమయం ముగిసిన తర్వాత పోలీసులు కలుగచేసుకుని గుంపులకు చెదర కొట్టారు. నామినేషన్‌కు వెళ్తున్న వైసీపీ మద్దతు దారులు నామినేషన్ పత్రాలను చించి వేసినట్లు వైసీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. అదే విధంగా తాళ్లూరు-1 అభ్యర్థిత్వానిని నామినేషన్ వేయటానికి వెళ్తున్న వారికి సైతం అడ్డగించి దాడి చేసిన నట్లు వైసీపీ వర్గీయులు ఆరోపించారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: