వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరే ప్రధాన లక్ష్యం – CMD పి. పుల్లారెడ్డి -ప్రకాశం సర్కిల్ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహణ

ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL) ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ పి. పుల్లారెడ్డి అధ్యక్షతన ప్రకాశం సర్కిల్ పనితీరుపై విజయవాడ కార్పొరేట్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో విద్యుత్ సరఫరా నాణ్యత, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, రెవెన్యూ వసూళ్లు, లైన్ లాస్ తగ్గింపు, విద్యుత్ భద్రత, నిర్వహణ పనులు, వర్షాకాల అత్యవసర సన్నద్ధత, సబ్‌స్టేషన్లు మరియు పంపిణీ వ్యవస్థ పనితీరు వంటి అంశాలపై సవివరంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా గౌరవ CMD మాట్లాడుతూ, వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న PM Surya Ghar – ముఫ్త్ బిజ్లీ యోజన, PM-KUSUM, RDSS ,సబ్ స్టేషన్ల పురోగతి తదితర పథకాల అమలు పురోగతిని సమీక్షించి, నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వినియోగదారులు కొత్త విద్యుత్ సర్వీస్ కనెక్షన్ కోసం ఇకపై ఈ-సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని గౌరవ CMD తెలిపారు. APCPDCL (www.apcpdcl.in ) అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా APCPDCL మొబైల్ యాప్‌ను ఉపయోగించి ఇంటి నుంచే సులభంగా కొత్త విద్యుత్ సర్వీస్ కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఆన్‌లైన్ సేవలను వినియోగించి సమయం, శ్రమను ఆదా చేసుకోవాలని వినియోగదారులకు సూచించారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ప్రమాదాల నివారణకు అన్ని రకాల భద్రతా చర్యలను కచ్చితంగా అమలు చేయాలని, విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు మరియు సబ్‌స్టేషన్ల నిర్వహణ పనులను వేగవంతం చేయాలని సూచించారు.
రెవెన్యూ వసూళ్లలో మెరుగైన ఫలితాలు సాధించడంతో పాటు విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, వినియోగదారులకు పారదర్శకమైన మరియు వేగవంతమైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని గౌరవ CMD శ్రీ పి. పుల్లారెడ్డి గారు ఆదేశించారు.
ఈ సమావేశంలో డైరెక్టర్ ఫైనాన్స్ ఎస్ .వెంకటేశ్వర్లు, డైరెక్టర్ టెక్నికల్ ఆవుల.మురళీకృష్ణయాదవ్, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ టీవీఎస్ఎన్ మూర్తి ,ప్రకాశం సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ కట్టా వెంకటేశ్వర్లు ,ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు హరిబాబు, వీరయ్య,అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *