ఓట్ బచావో – దేశ్ బచావో” ప్రచారానికి పి సి సి కోఆర్డినేటర్ గా కైపు వెంకట కృష్ణారెడ్డి నియామకం

దర్శి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఓట్ బచావో – దేశ్ బచావో” ప్రచారానికి పి సి సి కోఆర్డినేటర్ గా కైపు వెంకట కృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఏపీసీ అధికారిక ఉత్తర్వుల ప్రకారం ఎఐసీసీ పరిశీలకురాలు లక్ష్మీ హెబ్బాల్కర్ తో సమన్వయంతో ఆయన ప్రచార బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
పల్నాడు, ప్రకాశం, ఒంగోలు నగరం, ఎస్ పి ఎస్ నెల్లూరు, నెల్లూరు నగరం, తిరుపతి, తిరుపతి నగరం, చిత్తూరు, చిత్తూరు నగరం , ప్రస్తుతం ఆల్ ఇండియా అన్ ఆర్గనైజ్డ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ గా, దర్శి అసెంబ్లీ ఇన్ చార్జ్ గా ఉన్న కైపు వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచిన షర్మిలారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వహించి, ఓటు హక్కు ప్రాధాన్యత, ప్రజాస్వామ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తానని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *