పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

దేశ భద్రత, సమాజ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎం యుగంధర్ బాబు తో పాటు ఏఆర్ అడిషనల్ ఎస్పి జి నాగేశ్వరరావు, పోలీస్ అధికారులు, సిబ్బంది బుధవారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి కర్నూల్ రోడ్‌ కూడలి వద్ద ఉన్న పోలీస్ అమరవీరుల స్థూపం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అడిషనల్ ఎస్పీ ఎన్.యుగంధర్ బాబు మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమర వీరుల ధైర్యం, త్యాగం, సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని, వారి త్యాగస్ఫూర్తి భవిష్యత్ తరాలకు దేశభక్తి, కర్తవ్యనిబద్ధతకు ప్రేరణగా నిలుస్తుందని, పోలీస్ అమరవీరుల త్యాగఫలాన్ని సమాజం ఎప్పటికీ గుర్తుంచుకోవాలని, సమాజ భద్రత, దేశ ఐకమత్యం కాపాడడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని, పోలీసు శాఖ ఎల్లప్పుడూ ప్రజలతో కలిసి సామాజిక ఐక్యతకు కట్టుబడి ఉంటుందన్నారు.

ఈ ర్యాలీలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని అమరుల స్ఫూర్తిని స్మరించారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద కోవ్వొత్తులు వెలిగించి, ఘన నివాళులర్పిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు, సమాజ శ్రేయస్సుకై అహర్నిశలు పోరాడిన పోలీసు అమరుల త్యాగానికి “ఇవే మా జోహార్లు” అంటూ నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఆర్ఐలు రమణ రెడ్డి, సీతారామిరెడ్డి, ఆర్ ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *