జూబ్లీహిల్స్‌లో కత్తిపోట్ల కలకలం.. యువకుడిపై కత్తితో దాడి

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటగిరి వాటర్ ట్యాంక్ సమీపంలో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. మంగళవారం (అక్టోబర్ 27, 2026) రాత్రి 10:41 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

వివరాల్లోకి వెళ్తే.. నేపాల్‌కు చెందిన రాము (25), డానిష్ (32), విశాల్ (25) ముగ్గురూ స్నేహితులని, సినిమా పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్నారని సమాచారం. ఘటన జరిగిన సమయంలో ముగ్గురూ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో రాము, డానిష్‌లు కలిసి విశాల్‌పై కత్తితో దాడి చేసినట్లు ప్రాథమిక సమాచారం. ఈ దాడిలో విశాల్ కడుపు, ఛాతీ, వీపు భాగాల్లో కత్తిపోట్లు తగిలాయి. తీవ్రంగా గాయపడిన విశాల్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులుగా భావిస్తున్న రాము, డానిష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఈ కత్తిపోట్ల ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *