ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, ఒంగోలు టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ సి.ఐ. కమలాకర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ SI చెంచయ్య మరియు సిబ్బంది జిల్లాలో ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగా ఈరోజు (28.10.2026) మెదరమెట్ల, తాళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అనధికారికంగా నిర్వహిస్తున్న 3 బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించి, వారి వద్ద నుండి అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
1.కొరిసపాడు మండలం, మేదరమెట్ల గ్రామంలో పాత గుంటూరులోని బెల్ట్ షాపుపై పోలీసులు దాడి చేసి, ఎలాంటి లైసెన్స్ లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన 9 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
2.కొరిసపాడు మండలం, మేదరమెట్ల గ్రామం హైవే లో ఒక వ్యక్తి వద్ద అనధికారికంగా విక్రయించడానికి ఉంచిన 10 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రామాలలో పట్టుబడిన మొత్తం అక్రమ మద్యాన్ని, నిందితులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం మేదరమెట్ల పోలీస్ స్టేషన్లో అప్పగించడం అయినది. మేదరమెట్ల పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడం జరిగింది.
3.తాళ్లూరు మండలం, మల్కాపురం పంచాయతీ యానాది సంఘంలో ఒక వ్యక్తి వద్ద అనధికారికంగా విక్రయించడానికి ఉంచిన 14 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తాళ్లూరు పోలీస్ స్టేషన్లో అప్పగించడం అయినది.


Save or share this story as a newspaper-style Epaper Clip: