తాళ్లూరు మండలంలో పోలీంగ్ కేంద్రాలను సందర్శించిన ఏఈఆర్వో, డిప్యూటీ ఎంపీడీవోలు

తాళ్లూరు : మండలంలో జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఎంపీటీసీ ఎన్నికలు ఏకగీవ్రం కావటంతో జడ్పీటీసీ ఎన్నికలకు అభ్యర్థులు పోటీలో వుండటంతో అధికారులు ఆదిశగా చర్యలు చేపట్టారు. తహసీల్దార్ ఏఈఆర్వో బి. రమణారావు, డిప్యూటీ ఎంపీడీవో వి.శ్రీనివాసరావు లు మండలంలోని ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన 46 పోలింగ్ కేంద్రాలను గురువారం సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద నంబర్లు వేయించారు. పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని విఆర్వో, పంచాయతీ అభివృద్ధి అధికారులకు సూచించారు. ఏఈఆర్వో రమణారావు నేతృత్వంలో ఎంసీసీ బృందం తూర్పుగంగవరం సమీపాన చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. రెవెన్యూ, పోలీన్ యంత్రాంగం వాహనాలను పూర్తిస్థాయి లో తనిఖీలు చేపట్టారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఫణీంద్ర, ఆరి వై నుధీర్ కుమార్ లు విఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *