తాళ్లూరు: మండలంలో నవంబర్ 5 వ తేదీ జరుగనున్న జడ్పీటీసీ ఎన్నికలకు 14 ఎంపీటీ సి ల స్థానాల వారిగా 46 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో, ఏఈఆర్వో పి.అజిత గురువారం తెలిపారు. 46 పోలింగ్ కేంద్రాలందు 37,971మందిఓటర్లు నమోదై వున్నారని తెలిపారు. పోలింగ్ రోజున ఇబ్బందులు లేకుండా వుండేందుకు చర్యలుచేపట్టినట్లు తెలిపారు. బొద్దికూరపాడులో నాలుగు పోలింగ్ కేంద్రాలందు 3462 మంది ఓటర్లు, వెలుగువారిపాలెంలో నాలుగు పోలింగ్ కేంద్రాలందు 2313, నాగంబొట్లపాలెంలో మూడు పోలింగ్ కేంద్రాలో 3038 మంది, లక్కవరంలో నాలుగు పోలింగ్ కేంద్రాలందు 3473 మంది, దోసకాయలపాడులో మూడు పోలింగ్ కేంద్రా లందె 1970 మంది, తూర్పుగంగవరం-1లో మూడు పోలింగ్ కేంద్రాలందు 2880 మంది, తూర్పుగంగవరం-2లో నాలుగు పోలింగ్ కేంద్రాలందు 2861 మంది, మాధవరంలో రెండు పోలింగ్ కేంద్రాలందు 1944 మంది, తాళ్లూరు-1లో మూడు పోలింగ్ కేంద్రాలలో 2471 మంది, తాళ్లూరు -2లో మూడు పోలింగ్ కేంద్రాలందు 2476 మంది, తురకపాలెంలో నాలుగు పోలింగ్ కేంద్రాలో 4006 మంది, మన్నేపల్లిలో మూడు పోలింగ్ కేంద్రాలలో 1672 మంది, మల్కాపురంలో రెండు పోలింగ్ కేంద్రాలందు 1527 మంది, శివరాంపురంలో ఐదు పోలింగ్ కేంద్రాలలో 3878 మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: