దర్శి : ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, దర్శి డీఎస్పీ పి.బాల మురళీ కృష్ణ ఆధ్వర్యంలో దర్శి సీఐ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరంలో దర్శి సీఐ ఎన్.నాగమల్లేశ్వరరావు , అద్దంకి సీఐ ఎ.సుబ్బరాజు, దర్శి ,కురిచేడు ,తాళ్లూరు , ముండ్లమూరు , దొనకొండ ఎస్ఐ లు జి.ఏడుకొండలు, జి.కోటయ్య, ఎస్.మల్లికార్జునరావు, పి.కోటేశ్వరరావు, రామకృష్ణ లు పాల్గొన్నారు. 63 మంది పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు.దర్శి, అద్దంకి సర్కిళ్ల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది, స్థానిక డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఈ శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సెంట్రల్ కమిటీ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి, దేవతి ప్రసాద్, దనిరెడ్డి వెంకటరెడ్డి, బసవయ్య, రోశారావు, ఏడుకొండలు, సుశీలమ్మ హాజరై సహాయ సహకారాలు అందించారు.
అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, సిబ్బంది, ఒంగోలు రిమ్స్ మెడికల్ కళాశాల బ్లడ్ బ్యాంక్ డాక్టర్ సందీప్ శ్రీనివాస్, వారి సిబ్బంది పాల్గొన్నారు. ఈ శిబిరంలో 65 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.





Save or share this story as a newspaper-style Epaper Clip: