నాలుగు దశాబ్దాల తర్వాత టీడీపీ పాగా …జడ్పీటీసీ విజయం కోసం టి డి పి పావులు…..వైసీపీ కత్తి మీద సాము వలే ఎన్నికలు .. ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే ఫలితం ఒకలా… లేకుంటే మరోలా ఫలితం

తాళ్లూరు : నాలుగు దశాబ్దాల తర్వాత ఎట్టకేలకు తాళ్లూరు మండలంలో నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి, కడియాల లలిత్సాగర్ ల ప్రత్యేక కృషి , వ్యూహాలతో మొట్టమొదటిసారి నాలుగు దశాబ్దాల తర్వాత తాళ్లూరు మండలం ఎంపీపీ పెదవి ని టీడీపీ కైవసం చేసుకోంది. దీంతో
కూటమి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాళ్లూరు మండలంలో ఆది నుండి కాంగ్రెస్ వైపు మెజారిటీ కాగా, వైసీపీ ఆవిర్భావం తరువాత వైసీపీకి కంచుకోటగా మారింది. ఇంతవరకూ ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ ఎన్నడూ గెలవలేదు. దీంతో రాష్ట్ర పార్టీ టి డి పి ఈ మం డలంపై ప్రత్యేక దృష్టి సారించి గెలుపు బాధ్యతలను ఇన్చార్జి డాక్టర్ గొట్టిపా టికి అప్పగించింది. ఇన్చార్జి లక్ష్మి సహకారంతో మండలంలో టీడీపీ కూటమి శ్రేణులు కలిసికట్టుగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగి ఏకగ్రీవాలు చేసుకుని విజయం సాధించారు. వివరాల్లోకి వెళితే… మండలంలో 1995లో కాంగ్రెస్, 2001లో కాంగ్రెస్, 2006లో కాంగ్రెస్, 2014లో వైసీపీ, 2021లో వైసీపీ అభ్యర్థులు ఎంపీపీ, జడ్పీటీసీలుగా విజయం సాధిం చారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తీర్థం పుచ్చుకుని టీడీపీ ఎంపీపీగా కొనసాగారు. జడ్పీటీసీ స్థానం నుంచి మారం వెంకటరెడ్డి 2014, 2021 వరుసగా రెండు పర్యాయాలు వైసీపీ తరపున జడ్పీటీసీగా విజయం
సాదించారు. ఆయన కూడా వైసీపీని వీడి ఇటీవలే జనసేనలో చేరారు. కూటమికి మద్దతుగా నిలిచారు. నామినేషన్ల ప్రక్రి యలో కలిగిన ఇబ్బందులతో ఈ పర్యాయం వైసీపీ శ్రేణులు పాల్గొనక పోవటంతో 14 మంది టీడీపీ అభ్యర్థులు ఏక గ్రీవంకాగా ఎంపీపీ పీఠం ఆ పార్టీ వశమైంది. ఎట్టకేలకు ఎంతో కాలంగా టీడీపీ శ్రేణులు ఎంపీపీ స్థానానికి దక్కించుకునేందుకు వేసిన ఎత్తులు ఫలించి మొదటిసారిగా సంపూర్ణ ఆధిక్య తతో పీఠం కైవసం కావటంతో వారు ఆనందంలో మునిగిపోయారు. ఇదే ఉత్సాహంతో జడ్పీటీసీ స్థానం కూడా టీడీపీ అభ్యర్ధి విజయం సాధించేం దుకు పావులు కదుపుతున్నారు. వైసీపీ శ్రేణులు మాత్రం నామినేషన్ ప్రక్రియ గగనంగా మారిన తరుణంలో ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు కత్తి మీద సాము వలే ముందుకు సాగుతున్నారు. అయితే ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే ఫలితం ఒకలా లేకుంటే మరోలా ఉండేలా అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *