ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు గ్రామా ఎస్సీ కాలనీకి చెందిన పూనూరు రమేష్ అనే వికలాంగ కుటుంబానికి నెలకు సరిపడా నిత్యవసరకులను పొట్లూరు శ్రీనివాసరావు రమేష్ కుటుంబ సభ్యులకు సోమవారం అందజేశారు. పూనూరి రమేష్ ప్రమాదంలో కాలు పోగొట్టుకొని మంచంలో కాలం వెల్లదిస్తున్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాళ్లూరు మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న పొట్లూరు శ్రీనివాసరావు నెలకు సరిపడా నిత్యవసర సరుకులు బియ్యం బస్తా దుస్తులు దుప్పట్లు అందజేశారు. వారి ఉదార స్వభావానికి పది కాలాలపాటు చల్లగా ఉండాలని ఆయన సేవలను కొనియాడారు.
వికలాంగ కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ
02
Jan