సమ సమాజ స్థాపక కోసం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కృషి చేసారని వక్తలు కొనియాడారు. తాళ్లూరులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అండేడ్కర్ 135వ జయంతి ఘనంగా నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించి ఆయన గొప్పదనాన్ని వక్తలు కొనియాడారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, ఎంపీడీఓ అజిత, కరువది మేజర్ డిబీసి వైన్ చైర్మన్ తూము శివ నాగి రెడ్డి, మానం రమేష్ బాబు, క్లస్టర్ ఇన్చార్జి రాచకొండ వెంకట రావు, జి వేణుబాబు, గ్రామ పార్టీ అధ్యక్షుడు మారం వెంకట రెడ్డి, రామయ్య, శ్రీనివాన రావు తదితరులు పాల్గొన్నారు. తాళ్లూరులో వెల్లంపల్లి రోడ్ లో, ఎంపీయూపీ పాఠశాల వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అండేడ్కర్ విగ్రహాలకు అండేడ్కర్ యువజన సంఘం, నాయకుల ఆధ్వర్యంలో పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో అంబేడ్కర్ కు నివాళులు అర్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.
