సమస్యల పరిష్కారంమే లక్ష్యంగా గ్రామ సభలు నిర్వహణ

స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంగళ వారం మండలంలోని అన్ని పంచాయితీలలో గ్రామ సభలు నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తాళ్లూరు, తూర్పుగంగవరం, మల్కాపురం, మాధవరం, నాగంబొట్ల పాలెం, లక్కవరం, శివరామపురం, విఠలాపురం, బొద్దికూరపాడు, కొర్రపాటి వారి పాలెం, వెలుగు వారి పాలెం, మన్నేపల్లి, దోనకాయల పాడు, తూర్పుగంగవరం, రామభద్రాపురం, బెల్లంకొండవారి పాలెం, తురక పాలెం పంచాయితీలలో ఆయా పంచాయితీల ప్రత్యేక అధికారులు ఎంపీడీఓ పి అజిత, ఎంఈఓ జి సుబ్బయ్య, ఎంపీడీఓ కార్యాలయ పర్యవేక్షకులు గోపాల్ క్రిష్ణ, వ్యవసాయాధికారి బి ప్రసాద రావు, డిప్యూటీ ఎంపీడీఓ వి శ్రీనివాస రావు, ఎంఈఓ – 2 సుధాకర రావులు ఆయా గ్రామల కార్యదర్శులు షేక్ షహనాజ్ బేగం, డి నాగమల్లేశ్వరి, పి సుబ్బా రెడ్డి, ములకయ్య, శ్రీవల్లి, ఈ విశేషమ్మలు పాల్గొని గ్రామ నభ లక్ష్యాలను వివరించారు. తాళ్లూరు జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, కరువది మేజర్ డిబీసి వైస్ చైర్మన్ తూము శివ నాగి రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు మారం వెంకట రెడ్డి పాల్గొని సమస్యల పరిష్కారంలో ప్రత్యేక అధికారులు చొరవ చూపాలని కోరారు. ఆయా గ్రామాలలో టిడిపి, కూటమి నాయకులు, సొసైటీ చెరున్ లు వలభనేని నుబ్బయ్య, గొంది రమణా రెడ్డి (సమర) తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *