బన్సీలాల్ పేట, ఏప్రిల్ 14
(జే ఎస్ డి ఎం న్యూస్)
భారత రత్న డా. బి. ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి ని పురస్కరించుకుని బన్సీలాల్ పేట్ డివిజన్
న్యూ బోయిగూడ ఐ డి హెచ్ కాలనీ , జయ్ నగర్ కాలనీ , పద్మారావు నగర్ ,హమాలీ బస్తిలలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి కార్యక్రమాలలో బిజెపి రాష్ట్ర యువ నాయకులు మర్రి పురురవ రెడ్డి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మర్రి పురవారెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు నేటితరం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు.
ఈ కార్యక్రమములో బిజెపి నాయకులు అంగ ముత్తు శ్రీనివాస్ , వై. శ్రీనివాస్ , గుంటి సత్యనారాయణ , యం. రఘునాథ్ గౌడ్ , యం. అనిత , యం. యన్. శ్రీకాంత్ రెడ్డి , గోపి శ్రీనివాస్ , కె. నరేష్ , పార్శి పరమశ్ , కె.శ్రవణ్ , సగత్ వాళ్ళ వంశీ , ప్రొద్దుటూరి వినయ్ కృష్ణ , యం. చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

