ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సోమవారం తాడేపల్లిలో కలిసారు. దర్శి నియోజక వర్గంలో పలు అభివృద్ధి పనుల నిమిత్తం సీఎంకు విన్నవించినట్లు తెలిపారు. దర్శి ప్రభుత్వ డిగ్రీ కళాశాల బిల్డిండ్ మంజూరు చెయ్యాలని, దర్శి- దొనకొండ, తూర్పుగంగవరం- తాళ్లూరు, కురిచేడు- దొనకొండ (వయా రెడ్డిన పల్లి) రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చెయ్యాలని, జలజీవన్ మిషన్ ద్వారా మంజూరు అయిన రూ.143 కోట్ల రూపాయలు మంజూరుకు, దరిశ నగర పంచాయితీలో తాగు నీటి సరఫరా కొరకు అమృత పథకం ద్వారా మంజూరు అయిన రూ. 121 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టెలా అధికారులకు అదేశాలు ఇప్పించాలని, దర్శి పట్టణంలో కాపు కళ్యాణ మండపం మంజూరు చెయ్యాలని విన్నవించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం వైఎస్ జగన్ ను కలిసిన దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి
27
Feb