దర్శి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు గోళ్ళ పాటి సుధారాణి (ఎస్సీ మాదిగ కులము)ని అవమానించిన మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి (ఎంపిడిఓ) కుసుమ కుమారిని సస్పెండ్ చేయాలని నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాట్లాడుతూ …..దళితురాలైన ఎంపీపీ సుధారాణిని లెక్కచేయకుండా ఏకపక్షంగా ఒక జీవో ని అడ్డం పెట్టుకొని ఆ జీఓ ద్వారా 90 రోజులు గడవకముందే మండల పరిషత్ సమావేశం ఏర్పాటు చేయాలని నేపంతో వేధించటం సమంజసం కాదన్నారు. అదే పంచాయతీ రాజ్ చట్టం సెక్షన్ 168 లో ఎంపీడీవో, మండల పరిషత్ అధికారులు,సిబ్బంది. విద్యాసంస్థలపై నియంత్రణ కలిగిన వ్యక్తి ఎంపీపీ అనే సంగతి ఎంపీడీవో కి తెలియదా! పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం మండలానికి నిర్దేశించిన ఏ పనినైనా చేయమని ఎంపీడీవోని నిర్దేశించే హక్కు ఎంపీపీకి ఉందన్న సంగతి ఎంపీడీవో కి తెలియదా!
ఎంపీడీవో ఆఫీస్ లోని ఏ రికార్డునైనా మండల పరిషత్ అధ్యక్షురాలికి సెక్షన్ 163 ప్రకారం దాఖలు చేయమని కోరవచ్చు. ఎన్ని అధికారాలు ఉన్న దళితురాలు అనే ఎంపీపీ సుధారాణిపై ఎంపీడీవో పెత్తనం సాగిస్తుందని చెప్పి ఆరోపించారు. ఎంపీడీవో చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంపీడీవోని వెంటనే నిధులను సస్పెండ్ చేయాలని లేని పక్షంలో అన్ని ప్రజా సంఘాల తోటి ఏకమై నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు.
