శిద్దా మైలేజ్ పెంచిన థాంక్స్ -లోకేశ్ థాంక్స్ తో దర్శి వైసీపీలో శిద్దా కు పెరిగిన మైలేజ్-యువగళంలో మాజీ మంత్రి శిద్దా ఎటో చెప్పేసిన లోకేష్

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాద యాత్ర దర్శి నియోజకవర్గానికి చేరుకుంది… ఆయనను చూసేందుకు సైకిల్ పార్టీ లోని అభిమానులు భారీగా ముండ్లమూరుకు చేరుకున్నారు…ప్రజల మధ్య యువగళం పాదయాత్ర సాఫీగా జరిగింది..అనంతరం నాయకులు ఏర్పాటు చేసిన భారీ సభతో మొదలైంది అసలైన సినిమా…ఓ వైపు నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై మాట్లాడుతూనే మరో వైపు వైఎస్సార్సీపీ నాయకులపై తన స్టైల్ లో పవర్ ఫుల్ బాణాలు వేస్తూన్నాడు….సరిగ్గా టైం చూసి అందరూ ఆశ్చర్యపోయేలా పేరెత్తకుండా పెద్దాయన అని టిడిపి ప్రభుత్వంలో జిల్లాలో మంత్రి అంటూ, ఇప్పుడు పార్టీ మారాడని శిద్దా కు లోకేష్ చెప్పిన థాంక్స్ తో అక్కడే ఉన్న వేల మంది ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు…టిడిపి పార్టీని వీడిన వారందరికీ లోకేశ్ థాంక్స్ చెప్తున్నాడంటూ అన్న మాటలే వైసిపి లో మాజీ మంత్రి శిద్దా మైలేజ్ అమాంతం పెరిగేలా చేసాయంటూ దర్శి లో హాట్ న్యూస్ అయింది…శిద్దా ఎటు అనే ప్రశ్నకు శిద్దా వైసిపినే అని స్వయానా లోకేశ్ బాబే పూర్తి క్లారిటీ ఇచ్చినట్లు అర్థం అవుతుంది…మీరు పార్టీ లో లేనప్పటికీ కార్యకర్తలు పార్టీవెంటే ఉన్నారని నారా స్టైల్ లో మరో డైలాగ్ పేల్చేపడేశాడు నారా లోకేశ్…శిద్దా రాఘవరావు పూర్తిగా వైసిపి నాయకుడే అని లోకేశ్ సడన్ గా థాంక్స్ చెప్పి తేల్చేసాడు…చివరకు లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర తెలుగు తమ్ముళ్ళలో జోష్ పెంచుతూనే వైసిపి లో శిద్దాకు మైలేజ్ పెంచిందని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *