కాంట్రాక్టు విద్యుత్ కార్మికులు, ఎనర్జీ అసిస్టెంట్లను రెగ్యులర్ చేయాలని జేఏసీ నాయకులు మకాం ప్రసాద్ అన్నారు. తాళ్లూరు మండలంలో సోమవారం జాతీయ నాయకుల విగ్రహాలకు వినతిపత్రాలు అందజేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ సభ్యులు, జేఏసీ సభ్యులు హాజరై మాట్లాడారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఆగష్టు 2న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, 7న తిరుపతి కార్పొరేట్ కార్యాలయంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు తరలిరావాలని సంఘ సభ్యులు పేర్కొన్నారు. ఏఎల్ఎంలు మకాం ప్రసాద్, కే.ప్రసాద్, ఎనర్జీ అసిస్టెంట్ నరసింహారావు, షిఫ్ట్ ఆపరేటర్లు మందా నాగేశ్వరరావు, రమేష్, రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
