వరిలో కలుపు యాజమాన్య పద్దతులు కీలకం – వ్యవసాయ అధికారి ప్రసాదరావు

వరిలో వ్యాపించే కలుపు నివారణకు యాజమాన్య పద్ధతులు కీలకంగా మారనున్నాయని మండల వ్యవ సాయ అధికారి బి ప్రసాద్ రావు అన్నారు. క్షేత్ర పర్యటనలో భాగంగా సోమవారం తాళ్లూరులో వరి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి బి ప్రసాద్ రావు మాట్లాడుతూ…. ఖరీఫ్ సీజన్ లో మండలంలోని అన్ని గ్రామాలలో వరి పంటను ఎక్కువగా పండిస్తున్నారని దీనిలో కలుపు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని దీని నివారణకు యాజ మాన్య పద్ధతులు పాటించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ నాగరాజు, గ్రామ వ్యవసాయ సహాయకులు నాగరాజు నాయక్, రైతులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *