2023 ఖరీఫ్ సీజన్లో వర్షాధార పంటగా రైతులు పండించిన సజ్జ పంట దిగు బడులు ఆశాజనకంగా ఉన్నట్లు మండల వ్యవసాయ అధికారి బి ప్రసాదావు అన్నారు. క్షేత్ర పర్యటనలో భాగంగా శని వారం ఆయన దోసకాయలు పాడు గ్రామంలో పర్యటించి సజ్జ నూర్పిళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ… తాళ్లూరు మండలంలో 896.5 ఎకరాల విస్తీర్ణంలో సజ్జ పంటను పండించారని అది ఇప్పుడు కోత దశకు చేరుకుందని, కొన్నిచోట్ల నూర్పిళ్ళు కూడా చేస్తున్నారని సరాసరి ఎకరాకు 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో సజ్జలు క్వింటా 2600 రూపా యల నుండి 2700 వరకు ధర పలుకుతుందని రేట్లు కూడా అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు భార్గవి, రైతులు పాల్గొన్నారు.

