ప్రధాని ఉజ్వల యోజన పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ల లబ్ధిపొందండి – బిజేపి జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి

కేంద్రంలోని భారతీయ జనతాపార్టి ప్రభుత్వం పేద ప్రజల కొరకు ప్రధాని ఉజ్వల యోజన పథకం ప్రవేశపెట్టి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అదించడం జరుగుచున్నది. ఈ పథకం ద్వారా ప్రకాశం జిల్లా ప్రజలకు పదివేల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసినది. కనుక జిల్లాలోని గ్యాస్ లేని నిరుపేదలు మీ సమీపంలోనే గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లి మీ దృవపత్రాలను అందించి ఈకేవైసీ చేయించుకొని ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ స్టౌవ్, మరియు సిలెండర్ పొందవలసినదిగా భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

పివి శివారెడ్డి మాట్లాడుతూ …. గ్యాస్ అందుబాటు లేని రోజుల్లో ఎందరో ఊపిరితిత్తుల వ్యాధులతో బాధలు పడి మరణించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి వాటిని దృష్టిలో ఉంచుకొని పేద ప్రజలకు కట్టెల పొయ్యి, బొగ్గు పోయి, కుంపటి తదితర పురాతన వంట పొయ్యలను శాశ్వతంగా నిలిపివేసి ఉచితంగా గ్యాస్ అందించాలని లక్ష్యంతో ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ప్రధాని ఉజ్వల యోజన పథకం వంటగ్యాస్ పంపిణీ పథకాన్ని ప్రారంభించారని, ఉజ్వల 2.0 ద్వారా మే 31 2023 నాటికి కోటి అరవైలక్షల గ్యాస్ కనెక్షన్లు ఉచితముగా అందించిరని, మరియు మరోమారు ఉచిత కనెక్షన్లు విడుదల చేశారు. నిరుపేద కుటుంబాలకు ఉజ్వల పథకం ఎంతో సౌలభ్యంగా ఉంటుందని కనుక ప్రతి ఒక్కరూ సమీపంలోని గ్యాస్ ఏజెన్సీ వెళ్లి పేరు నమోదు చేయించుకొని పథకం ద్వారా లబ్ధి పొందాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *