అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని దర్శి డీఎస్సీ అశోకవర్ధన్ రెడ్డి పిలుపుని చ్చారు. విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా స్థానిక పీజీఎస్ కాంప్లెక్స్ లో ఏసీబీ సీఐ అవర్ల అధ్యక్షతన శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ అవినీతిని నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. దీనిలో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉంటుందని వివరించారు. వీరు మిగిలిన వారికి ఆదర్శంగా నిలవాలని సూచిం చారు కార్యక్రమంలో సీఐ రామకోటయ్య, ఎంవిఐ రవికుమార్ ,సెబ్ సీఐ సుందరరామయ్య, విద్యుత్తు శాఖ డీఈ పిచ్చయ్య, ఎంపీడీవో కుసుమకుమారి, ఎంఈవో రఘురామయ్య, డిటీ రవిశం కర్, ఎస్సై రామకృష్ణ, పలు శాఖలకు చెందిన అది కారులు, సిబ్బంది పాల్గొన్నారు


