అఖిల భారత యాదవ మహాసభ నియోజకవర్గ స్థాయి సమావేశం ఆదివారం దర్శి లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో దర్శి నియోజకవర్గ అధ్యక్షుడు యన్నాబత్తుల వెంకటసుబ్బయ్య యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల రామారావు యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ మండలాలకు నూతన బాధ్యుల నియామకం చేపట్టారు. దర్శి టౌన్ అధ్యక్షులుగా చిట్టి బోయిన గురవయ్య యాదవ్, దర్శి రూరల్ మండల అధ్యక్షులుగా గాలం శ్రీను యాదవ్, దొనకొండ మండల అధ్యక్షులుగా గుమ్మా యల్లయ్య యాదవ్, తాళ్లూరు మండల అధ్యక్షులుగా చిమట సుబ్బారావు యాదవ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బొరిగొర్ల మురళీకృష్ణ, తలారి కోటయ్య, కొరివి ముసలయ్య, బట్టు రామారావు యాదవ్, గుడిపాటి చిరంజీవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

