రాజకీయంగా ఆర్యవైశ్యులకు అధిక ప్రాధాన్యత కల్పించిన పార్టీ బిఆర్ఎస్ అని సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం బేగంపేట లోని హరిత ప్లాజా లో ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యులు చేసే సేవా కార్యక్రమాలు ఎంతో గొప్పవని అన్నారు. వారు చేసే సేవలను దృష్టిలో ఉంచుకొని సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బల్కంపేట, మహంకాళి, సికింద్రాబాద్ గణేష్, కనకదుర్గమ్మ తదితర దేవాలయాల కమిటీ లలో ఆర్య వైశ్యులకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఎంతో ప్రసిద్ది చెందిన బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో అద్బుతమైన అద్దాల మండపాన్ని నిర్మించిన బండారు సుబ్బారావు ను ఈ సందర్బంగా మంత్రి అభినందించారు. దేవాలయాల పవిత్రతను కాపాడటంతో పాటు ఆలయాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. బల్కంపేట, మహంకాళి దేవాలయాలతో పాటు నియోజకవర్గ పరిధిలోని ఇతర దేవాలయాలను కూడా ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. నిరంతరం ప్రజల మద్య ఉంటూ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. సమస్యలతో తన వద్దకు ఎవరు వచ్చినా ఖచ్చితంగా వాటిని పరిష్కరిస్తున్నామని అన్నారు. తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, మరోసారి ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తీ నియోజకవర్గ పరిధిలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని కోరారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, బండారు సుబ్బారావు, సింగారపు శ్రీనివాస్ గుప్త, మంచాల అశోక్, మహంకాళి రాజేశ్వరరావు, ఉప్పల యాదగిరి, వాడకట్టు శ్రీకాంత్ గుప్త, ఆనంద్ గుప్తా, బిజ్జాల శివశంకర్ గుప్త, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
