అంతర్జాతీయంగా నాణ్యమైన పొగాకు మంచి డిమాండ్ – పండుగులను వేలం కేంద్రంలోనే కొనుగోలు చేస్తాం- పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్

అంతర్జాతీయంగా నాణ్యమైన పొగాకుకు మంచి డిమాండ్ ఉందని పండుగుల్లను సైతం వేలం కేంద్రంలోనే కొనుగోలు చేస్తామని గుంటూరు రీజనల్ పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్ అన్నారు. పొగాకు బోర్డు రీజనల్ మెనేజర్ కార్యాలయంలో మంగళవారం బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ నెల్లూరు, ప్రకాశం జిల్లాల పొగాకు వేలం కేంద్ర రైతు కమిటీ అధ్యక్షులు, రైతు నాయకులు, పొగాకు బోర్డు సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ…… పొగాకు ఉత్పత్తులకు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో పొగాకు మంచి డిమాండ్ ఉందని అన్నారు. తాను పొగాకు పండించే రైతు కుటుంబం నుండి వచ్చానని, లాభ నష్టాలు తనకు తెలుసునని అన్నారు. రైతులు, పొగాకు బోర్డు సభ్యులు, వ్యాపారస్తులు అందరూ కలసి కుటుంబంగా లాభాల బాటలో నడవాల్సిన విధానాన్ని వివరించారు. నాణ్యమైన పొగాకు పండించటానికి సూచనలు చేసారు. పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర శ్రీధర్ బాబు ముగిసిన వేలంలో విప్లవాత్మక మార్పులు తీసువచ్చారని అన్నారు. పొగాకు సూర, పండు గుల్లను వేలం కేంద్రాలలో అమ్మకాలు ఈ సంవత్సరం ప్రారంభించారని అన్నారు. పొగాకు సూరకు ఈ సంవత్సరం అధిక ధర లభించినదని చెప్పారు. అదే విధంగా పండుగుల్లను. కూడ ప్రయోగాత్మకంగా చేసారని అన్నారు. రాబోవు సంవత్సరం ఇదే విధానాన్ని కొనసాగిస్తామని, పండుగుల్ల ఎవరైనా సరే బయట కొనుగోలు చేస్తే, లేదా బయట అమ్మకాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. విజిలెన్స్తో తనిఖీలు నిర్వహిస్తామని అన్నారు. పండుగులను కూడ పొగాకు వేలం కేంద్రంలోనే అమ్మాలని దయచేసి బయట అమ్మకాలు చేయవద్దని అన్నారు.
వైఎస్సార్సీపీ రైతు విభాగం రీజనల్ కోఆర్డినేటర్, జిల్లా పొగాకు బోర్డు మెంబర్ మారెడ్డి సుబ్బా రెడ్డి మాట్లాడుతూ…… చైర్మన్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, పండుగుల వ్యాపారస్తులు వేలం కేంద్రలోనే కొనుగోలు చెయ్యాలని, బయట అమ్మకాలు సాగించవద్దని అన్నారు. అందుకు రైతు నాయకులు, బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారు. ముంగమూరులో విద్యుత్ పరికరాలతో నడిచే బ్యారన్ ను సందర్శించారు. రైతులు యాంత్రీకరణ వైపు మొగ్గుచూపే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రీజనల్ మెనేజర్ లక్ష్మణరావు, ఒంగోలు – 1వేలం నిర్వాహణాధికారి రవికాంత్, ఐటీసీ మెనేజర్ శివకుమార్, పొగకు బోర్డు సభ్యుడు బొడ్డపాటి బ్రహ్మయ్య, పొద వర ప్రసాద్, వేలం కేంద్రం అధ్యక్షుడు వడ్డెళ్ల వరప్రసాద్, నాగినేని భాస్కర్, గుణ శేషయ్య, కొండా రెడ్డి, రమణయ్య, శ్రీకాంత్, ఆళ్ల సుబ్బారావు, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుగా చైర్మన్ యశ్వంత కుమార్ ను అధికారులు, బోర్డు సభ్యులు, రైతులు ఘనంగా సన్మానించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *