బాల్యవివాహాలను అరికట్టి వారి భవిష్యత్కు బంగారు బాటలు వేయాలని సీడీపీఓ సీహెచ్ భారతి, ఎంఈఓ కాకర్ల రఘురామయ్య అన్నారు.
దళిత బహుజన రిసోర్సెసెంటర్ ఆధ్వర్యంలో ” బాల్యవివా హాలు అంతమొందిద్దాం వారి భవిష్యత్ను కాపాడు కుందాం” అనే అంశానికి సంబంధించిన కరపత్రాలు సోమవారం విడుదల చేశారు. సమాజంలో ఎదుగుతున్న బాలబాలికలకు చిన్న వయస్సులో వివాహం చేసి వారి మానసిక సామాజిక కష్టాన్ని నష్టాలను అధిక మించాలన్నారు. సమాజంలో ఉన్న చట్టాలకు లోబడి 18 నిండిన బాలికలకు వివాహ వయస్సు అని నిర్ధారించారు. మండల కోఆర్డినేటర్ కావూరి నాగమణి, గర్నెపూడి ప్రేమకుమార్, రాచపూడి మోషె, సూపర్ వైజర్లు పాల్గొన్నారు.
