దర్శి పట్టణంలోని పొదిలి రోడ్డులో బూచేపల్లి నివాసం వద్ద బీవీఎస్ఆర్ బ్రమర వెంచర్ ను జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్యలు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగాప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి బ్రోచర్ విడుదలచేశారు. క్యాలెండర్లను ఆవిష్కరించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ… దర్శి పట్టణంలో అన్నీ హంగులతో వెంచర్ వేయడం శుభపరిణామం అన్నారు.హైదరాబాద్, బెంగుళూరు వంటి మహానగరాల్లో ఉండే అన్నీహంగులతో ఈ వెంచర్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎండీ అండ్ చైర్మన్ గల్లా రామచంద్రరావును జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అభినందించారు.


