తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరంలో కాపు జేఏసీ ఆధ్వర్యంలో మంగళ వారం దివంగత నేత వంగవీటి మోహనరంగా వర్ధంతి నిర్వహించారు. కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కన్నెగంటి వెంకటేశ్వర్లు మాట్లా డుతూ పేదల పక్షాన నిలబడిన మహానేత మోహనరంగా అని, ఆయన సేవలను కొనియాడారు. అనంతరం రాంగా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. కాపు నాయకులు మారా బత్తుల సుజాత పాల్గొన్నారు.
