అంతర్జాతీయంగా నాణ్యమైన పొగాకుకు మంచి డిమాండ్ ఉన్నదని గుంటూరు రీజియన్ పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్ అన్నారు. పొగాకు బోర్డు రీజనల్ కార్యాలయంలో మంగళవారం బోర్డు రీజనల్ మెనేజర్ లక్ష్మణరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు రీజియన్ పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ పండుగుల్లను పొగాకు కేంద్రంలోనే కొనుగోలు చేస్తారని చెప్పారు. వ్యాపారస్తులు డిడిలు తీసి పండుగుల్లను కొనుగోలు చెయ్యాలని కోరారు. పొగాకు మార్కేట్ పరిస్థితి చాల బాగా ఉందని రైతులు మంచి నాణ్యమైన పంటను తీయ్యాలని కోరారు. గ్రేడింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు. కర్నాటలో అదనపు పంటపై జరిమాన విషయంలో కేంద్ర వాణిజ్య శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఈ విషయమై మరలా చర్చించాల్సి ఉందని బోర్డు సభ్యులు నిర్ణయించారు. రైతులకు సబ్సిడీపై అందిస్తున్న నీటి పైపులపై అదనపు సబ్సిడీ, వేలం కేంద్రాలను అందుబాటులో ఉంచే విషయమై చర్చించారు. పొగాకు చూర, బిట్స్, పండుగుల్ల రైతుల కోటాలో నమోదు కాదని రైతులకు తెలియజెయ్యాలని ఆమోదించారు. సమావేశంలో పొగాకు బోర్డు సభ్యులు మారెడ్డి సుబ్బారెడ్డి, పొద వర ప్రసాద్, బొట్టపాటి బ్రహ్మయ్య, ప్రకాశం, నెల్లూరు జిల్లా వేలం కేంద్రాల అధ్యక్షులు రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

