నిరుద్యోగ రహిత ఏపీనే ప్రభుత్వ లక్ష్యం – దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ – దర్శిలో మెగా జాబ్ మేళాకు విశేష స్పందన

ఆంధ్రప్రదేశ్ ను నిరుద్యోగ రహితంగా తీర్చిదిద్దేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి నెలా ఏపీఎస్ఎస్ఈసీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా లను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొన్నారు. దర్శిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం మెగా జాబ్ మేళా ను నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ.. మెగా జాబ్ మేళా లను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగం రాని వారు నిరాశ చెందకుండా ఏపీపీఎస్ఎస్ఈసీ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, డీఆర్డీఏ, సీడాప్ ద్వారా దర్శి డిగ్రీకళాశాలలోని స్కిల్ హబ్ ల అకౌంట్ ఎగ్జిక్యూటివ్ కోర్స్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, రిటైల్ అసోసియేట్ కోర్సుల్లో చేరాలని చెప్పారు. జాబ్ మేళా లో 12 కంపెనీలు పాల్గొనగా 262 మంది యువతహాజరయ్యారు. 108 మంది సెలెక్ట్ కాగా 28 మందిని షార్ట్స్ట్ చేశారు. సెలెక్ట్ అయిన వారికి ఆఫర్ లెటర్లు అందజేశారు. డీఆర్డీఏ పీడీ రవికుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ సావిత్రమ్మ, నగేష్, డీఈఓ భరద్వాజ్, జేఈఓ రాజారావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *