అంబేడ్కర్ ఆశయ సాధనలో సీఎం జగనన్న – ఓట్ల కోసం హామీలు ఇచ్చేది చంద్రబాబుఇచ్చిన మాటకు కట్టుబడింది సీఎం వైఎస్ జగన్- అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు భారీగా తరలి రావాలి- జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ

బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ఆశయ సాధనలో అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ నియోజక దర్శి వర్గ ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. స్థానిక బూచేపల్లి నివాసంలో నియోజక వర్గంలోని ఐదు మండలాలు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో బుధవారం సమావేశ నిర్వహించారు. ఈ నెల 19న ప్రారంభమయ్యే సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతి వనం పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకాయమ్మ, వైఎస్ఆర్సిపి దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు మాట్లాడుతూ భరతమాత ముద్దుబిడ్డ, రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం దేశంలో ఎక్కడా నేని విధంగా రూ.404 కోట్లతో విజయవాడ నడిబొ డ్డులో 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గతంలో చంద్రబాబు. 100 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. గతంలో చంద్రబాబు 100 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని అమరావతి రాజధాని గ్రాఫిక్స్ లో ఫోటోలుచూపించి దళితుల ఓట్లేయించుకుని వదిలేశార న్నారు. దేశంలో ఎంతో మంది పార్టీల నాయకులు ఉన్నా ఒక్క సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అంబేడ్కర్ పై ప్రేమతో రెండేళ్లలోనే స్వరాజ్య మైదానంలో దేశం గర్వించే విధంగా విగ్రహాన్ని నిర్మించారన్నారు. రూ.2 వేల కోట్లు విలువ చేసే ఆ స్థలాన్ని నాటి టీడీపీ హయాంలో చం ద్రబాబు, టీడీపీ నాయకులు కొల్లగొట్టాలని ప్రయ త్నించారని ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్ అం త విలువైన స్థలంలో 125 అడుగుల ఎత్తుతో అం బేడ్కర్ విగ్రహాన్ని మరో 80 అడుగుల బేన్ ఏర్పాటు చేసి 200 అడుగుల ఎత్తు అంబేడ్కర్ సృ తివనం ఏర్పాటు చేశారన్నారు. అందులో 2 వేల మంది వీక్షించే థియేటర్, 3 వేల మంది కూర్చునే ఆడిటోరియం, ఫొటో గ్యాలరీ, లైబ్రరీ, సుందరమైన పార్కుతో ఆయన స్మృతి వనం దేశం గర్వించేలా ఉందన్నారు. మార్కెట్ యార్డ్ పదవులకు కూడా రిజర్వేషన్లు కేటాయించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సమన్యాయం చేసిన గొప్ప సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. 19వ తేదీ ఉదయం 9 గంటల నుంచి నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి 20 బస్సులు బయల్దేరుతున్నాయని. అవి చాలకపోతే మరిన్ని బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమా నులు పాల్గొని కార్యక్రమం చేయాలని కోరారు.
షేక్ కార్పొరేషన్ డైరెక్టర్, వైద్యవిభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ఎం బాషా, దర్శి తాళ్లూరు మండలాల కన్వీనర్లు వెన్నపూస వెంకట రెడ్డి, తూము వెంకట సుబ్బారెడ్డి, ఎంపీపీ సుధాఅచ్చయ్య, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు గాలి మూటి దేవప్రసాద్, దొనకొండ జేసీఎస్ కన్వీనర్ గుంటు పోలయ్య, జెడ్పీటీసీలు రత్నరాజు, నుసుం నాగిరెడ్డి, సొసైటీ అధ్యక్షులు వేమిరెడ్డి చెన్నారెడ్డి, పోతిరెడ్డి నాగిరెడ్డి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, కోరే సుబ్బారావు, మాజీ ఎంపీపీలు ఇత్తడి దేవదానం, గోళ్లపాటి మోషే, కోట రామి రెడ్డి, పోశం మధుసూదన్ రెడ్డి, మాజీ మండల కన్వీనర్లు కాకర్ల కృష్ణారెడ్డి, సూదిదేవర అంజయ్య, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కేవీరెడ్డి, సొసైటీ మాజీ ఉపాధ్యక్షుడు సద్ది పుల్లారెడ్డి, నాయకులు మానికొండ వెంకయ్య, బిజ్జం శ్రీనివాసరెడ్డి,గురవారెడ్డి పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *