సీబీఎస్ఈ ఫలితాల్లో అక్షర వాగ్దేవి విద్యార్థుల ప్రతిభ.

సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో కంటోన్మెంట్ లోని అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు తమ సత్తా చాటారు. ఇటీవల ప్రకటించిన ఈ ఫలితాల్లో పాఠశాలకు సంబంధించి 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని పాఠశాల కరెస్పాండెంట్ పి.ఎల్ శ్రీనివాస్, డైరెక్టర్ సుశీల్ కుమార్ లు తెలిపారు. ఈ మేరకు గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నిపుణులైన ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల కృషి, వారి కుటుంబ సభ్యుల తగిన ప్రోత్సాహం వల్లే మెరుగైన ఫలితాలు సాధించగలిగామని వారు వెల్లడించారు. మెరుగైన ఫలితాలు సాధించడంలో సీఈఓ యశస్వి, అకాడమిక్ డైరెక్టర్ అలేఖ్యల పాత్ర మరువలేనిది అన్నారు. సమావేశంలో పాఠశాల ప్రిన్సిపల్ వనజ, వైస్ ప్రిన్సిపల్ రచన ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *