సార్వత్రిక ఎన్నికల్లో తాళ్లూరు మండలంలో 37,722 మంది ఓటర్లకు గాను 34,782 మందిఓటు హక్కు వినియోగించుకున్నారు. 2019ఎన్నికల్లో 92శాతం పోలింగ్ నమోదుకాగా ఈ ఎన్నికల్లో 92.2శాతం పోలింగ్ నమోదయింది. ఈ ఎన్ని కల్లో పురుషులు 17,514 మంది, మహిళలు 17,268 మంది ఓటుహక్కు వినియోగిం చుకున్నారు. తాళ్లూరులో 2,274 మంది, తూర్పుగంగవరంలో 2,223 మంది, తురకపాలెంలో 938 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలో అత్యధికంగా లక్కవరం, విఠలా పురం గ్రామాల్లో 95 శాతం పోలింగ్ నమోదు కాగా, తురకపాలెంలో అత్యల్పంగా 86శాతం నమోదయింది.
తాళ్లూరు మండలంలో 92.2 శాతం పోలింగ్ -అధికంగా ఓటుహక్కు వినియోగించుకున్న మహిళలు
17
May