సమస్యల పరిష్కారంలో అధికారులు జవాబు దారిగా వ్యవహరించాలని టిడిపి దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కోన్నారు. తాళ్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో బుధవారం ప్రజా దర్భార్ కార్యక్రమం నిర్వహించారు. టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సమస్యను క్షున్నంగా పరిశీలించి సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజా సమస్యలు వేగవంతంగా పరిష్కరించేందుకే ప్రజా దర్భార్ అన్నారు. రెవిన్యూ సమస్యలు, సర్వేలు వంటి వాటిపై నిర్లక్ష్యం వహించవద్దని చెప్పారు. నూతనంగా మంజూరు అయిన పాన్పుస్తకాలను పంపిణీ చేసారు. 9 మంది లబ్దిదారులకు మంజూరు అయిన రూ.4.95 లక్షల విలువైన సీఎం ఆర్ఎఫ్ చెక్కులను అందించారు. 10 మందికి మంజూరు అయిన స్పౌంజ్ పెన్షన్లను అందించారు. ఆయా కార్యక్రమాలలో నియోజక వర్గ టిడిపి పరిశీలకులు గంజాం రాఘ వేంధ్ర, మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, షేక్ పెద కాలేశా వలి ( బడే),
కళాపరిషత్ రాష్ట్ర డైరెక్టర్ ఓబులు రెడ్డి, మానం రమేష్, సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని సుబ్బయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షుడు పరిశుధ్ధరావు. క్లస్టర్ ఇన్చార్జి రాచకొండ వెంకట రావు, కైపు నాగార్జున రెడ్డి, ఇడమకంటి సుబ్బా రెడ్డి, కొర్రపాటి వేణు, నవులూరి విద్యా సాగర్, కైపు కోటి రెడ్డి , సూరిబాబు (పెద్దన్న), పిన్నిక రమేష్ , గ్రామ పార్టీ అధ్యక్షుడు మారం వెంకారెడ్డి , వెలుగు సుబ్బారావు , సిహెచ్ వీర నాగిరెడ్డి , హనుమారెడ్డి ,నాగేశ్వరావు , సుజాత,చాట్ల డాని, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా స్వర్గీయ సీఎం ఎన్ టిఆర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.










