నల్గొండ, జూలై 1,
(జే ఎస్ డి ఎం న్యూస్):
తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాలుగా మారిన మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అత్యంతసాహసోపేతంగా అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపిన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గత కొంతకాలంగా వరుస చోరీలకుపాల్పడుతున్న పాత నేరస్థుడు భూష్మి శ్రీకాంత్ అలియాస్ అమ్మిరాజు (ఆంధ్రప్రదేశ్) ముఠానుపట్టుకునేందుకు సీసీఎస్,
మిర్యాలగూడ రూరల్ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జూన్ 30న ఈ ముఠా ఓ డీసీఎం వాహనంలో ఓఆర్ఆర్ మీదుగా హైదరాబాద్ వైపు వస్తుండగా పోలీసులువెంబడించారు.వాహనాన్ని ఆపిన వెంటనే ప్రధాన నిందితుడు శ్రీకాంత్ ఇనుప రాడ్‌తో సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరిపై దాడికి
తెగబడ్డాడు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం మొదట గాలిలో హెచ్చరిక కాల్పులు జరిపారు. అయినప్పటికీ నిందితుడు వినకపోవడంతో, పోలీసులు అతని కాళ్లపై కాల్పులు జరిపిలొంగదీసుకున్నారు. గాయపడిన నిందితుడిని చికిత్స నిమిత్తం వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిపై ఆదిభట్ల పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో శ్రీకాంత్‌తో పాటు డీసీఎం డ్రైవర్ వేల్పుల అతేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో కానిస్టేబుల్ మర్డర్ కేసులో నిందితుడైన శ్రీకాంత్‌పై తెలుగు రాష్ట్రాల్లో 40కి పైగా దొంగతనం కేసులు ఉన్నాయి. ప్రాణాలకు తెగించి నిందితులను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, నగదు బహుమతులు ప్రకటించారు.
