శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే చర్యలు -ఎస్సై వై.వి.ర మణయ్య

ఎన్నికల కౌంటింగ్, అనంతరం గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కల్గించేందుకు యత్నిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని ఎస్సై వై.వి.ర మణయ్య హెచ్చరించారు. పోలింగ్ సందర్భంగా కొర్రపాటి వారిపాలెం గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగ టంతో ఉన్నతాధికారుల ఆదేశాను సారం ఆ గ్రామంలో పోలీసులు బుధవారం మార్చ్ ఫ్లాగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై వైవి రమణయ్య మాట్లాడుతూ… ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినం దున గ్రామాల్లో శాంతికి విఘాతం కల్గించ వద్దన్నారు. గ్రామంలోని అన్ని వీధుల్లో ఎస్సై రమణయ్య సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై మోహన రావు, సిబ్బంది ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *