విత్తనాల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు – ఏవో ప్రసాద్ రావు

రైతులకు సరఫరా చేసే విత్తనాల్లో నాణ్యత లోపిస్తే అందుకు బాధ్యులైన డీలర్లపై కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసా యాధికారి, క్వాలటీ కంట్రోల్ ఆఫీసర్ బి.ప్రసాద రావు హెచ్చరించారు. మండలంలోని తూర్పుగంగ వరంలో వెంకటసాయి రైతు డిపో, శ్రీపసన్నాంజ నేయ సీడ్స్ దుకాణాలను ఆయన బుధవారం ఆక స్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపులోని రికార్డులకు, స్టాకు రిజిస్టర్, నిల్వ ఉన్న స్టాకు వివరాలను పరిశీలించారు. విత్తనాలు కొను గోలు చేసే ప్రతి రైతులకు తప్పని సరిగా బిల్లు రసీదు ఇవ్వాలన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే షాపు నిర్వహకులను రైతులు నిలదీయాలన్నారు. ఆయా దుకాణాల్లో నిల్వ ఉన్న వరి, సజ్జ, పచ్చ పెసల శాంపిల్స్ను సేకరించారు. క్వాలిటీ పరీక్షల కోసం రీజినల్ కోడింగ్ సెంటర్ తాడేపల్లిగూడేనికి పంపుతామని చెప్పారు. ల్యాబ్ల నుంచి పరీక్షల ఫలితాలు రాగానే నాణ్యత ప్రమాణాల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. డీలర్లు అనుమతి పొందిన కంపెనీలకు చెందిన నాణ్యమైన విత్తనా లను మాత్రమే విక్రయించాలన్నారు. లూజు విత్త నాలు అమ్ముతున్నట్లు రైతులు ఫిర్యాదు చేస్తే చర్యలు తప్పవని డీలర్లను హెచ్చరించారు. ఏఈఓ నాగరాజు, రైతులు, డీలర్లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *