గ్రామ సభల ద్వారా రెవిన్యూ సమస్యలు పరిష్కరించుకోవాలని రీ సర్వే డీటీ ప్రశాంత్ అన్నారు. శంకర నారాయణ పురం రెవిన్యూ పరిధిలో రెవిన్యూ సమస్యల పరిష్కార నిమిత్తం బొద్దికూర పాడులో బుధవారం గ్రామ సభ నిర్వహించారు. అందులో వివిధ సమస్యలపై రైతుల నుండి 24 వినతులు అందాయి. అందులో జాయింట్ సర్వే 11, భూ సర్వే లోపాలు 8, పట్టాదారు పాస్ పుస్తకాల నిమిత్తం ఐదు దరఖాస్తులు అందినట్లు చెప్పారు. విఆర్ శివా రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
