మండలంలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో అపార్ (ఆటోమెటిక్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ), ఎఫ్ఎ-1 మార్కుల నమోదు వేగవంతం చెయ్యాలని మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య కోరారు. మండలంలోని తూర్పుగంగవరం, నాగంబొట్ల పాలెంలతో పాటు పలు పాఠశాలలో ఆపార్, ఎస్ఏ- 1 మార్కుల నమోదుపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసారు. నమోదుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల డేటా ఎంట్రీ ఆపరేటర్లతో ఎంఆర్సీలో ప్రత్యేక సమావేశం నిర్వహించి నమోదుపై ఉన్న సందేహాలను వివరించి ఆపార్ వేగవంతం చేసారు.

