దర్శి సర్వశిక్షా అభియాన్ స్కూల్ దివ్యాంగుల విద్యార్థులకు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టి పాటి లక్ష్మీ స్వంత నిధులతో సమకూర్చిన మూడు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ… సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్లు రూ.3వేల నుంచి రూ.6వేలకు పెంచి అందిస్తున్నట్లు చెప్పారు. సంక్షేమం అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించారు. కార్య క్రమంలో నగర పంచాయతీ చైర్మన్ పిచ్చయ్య, ఎం .శోభారాణి, నాగ మణి, ఎంఈవో రఘురామయ్య, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


