ఆల్ ఇండియా మహాత్మ సోషల్ క్లబ్స్ ఒంగోలు శాఖలు ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు, ఎయిమ్స్ క్లబ్ వనిత ఒంగోలు, ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు జూనియర్స్ మరియు వాసవిక్లబ్ ఒంగోలు సంయుక్త ఆధ్వర్యంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని మాతా శిశు వైద్యశాల లోని గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పండ్లు, రొట్టెలు, చిన్నారులకు జుబ్బాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆలిండియా మహాత్మా సోషల్ క్లబ్స్ పూర్వ జాతీయ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా మాత శిశువుల మధ్య దీపావళి పండుగను ఎయిమ్స్ క్లబ్స్ నిర్వహణలో ఘనంగా జరుపుకుంటున్నామని దీపావళి అంటేనే అంధకారాన్ని అంతం చేయడానికి దివ్య దీపాలు వెలిగించి అందరి జీవితాల్లో ఆరోగ్యము సంతోషముల వెలుగు పూలు వికసించాలని ఆ పరమేశ్వరి, జగన్మాతను పూజించడమేనని వివరించారు.
దీపావళి సేవా కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ మాత శిశు వైద్యశాలలో దీపావళి పండుగ జరుపుకోవడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఈ సందర్భంగా మాతృమూర్తులకు పిల్లలకు సేవ చేసుకునే భాగ్యం కలగడం మేము అదృష్టంగా భావిస్తున్నామని వాసవిక్లబ్ ఒంగోలు అధ్యక్షులు నల్లమల్లి బదరి నారాయణ తెలిపారు.
కార్యక్రమంలో ఒంగోలు ఎయిమ్స్ క్లబ్ పూర్వ జాతీయ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం, సభ్యులు నేరెళ్ల శ్రీనివాసరావు, తుమ్మపూడి ఏడుకొండలు, ధనిశెట్టి రామునాయుడు, చీదెళ్ల వేంకట ప్రసాద్, భూమా శ్రీనివాసులు, వాసవిక్లబ్ ఒంగోలు అధ్యక్షులు నల్లమల్లి బదరీ నారాయణ, సుధీర్ కుమార్, కే. జగన్నాధం (బాబాయ్) గుడివాడ పార్ధసారధి, బి. విజయరావు, టి. సత్యవతి, గుర్రం కృష్ణ, సుబ్బయ్య మరియు ప్రసూతి వైద్యనిపుణులు డా. చైతన్య తదితర సిబ్బంది పాల్గొన్నారు.







