ప్రజా సమస్యల పరిష్కారం కొరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం నందు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక”(పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు వారి యొక్క వ్రాతపూర్వక అర్జీలను ఉన్నత పోలీస్ అధికారులు స్వయంగా స్వీకరించి వారితో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయా ఫిర్యాదులపై సంబందిత పోలీస్ స్టేషన్ ల అధికారులతో మాట్లాడి, ఆ ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి త్వరితగతిన తగిన న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు, భూవివాదాలు, జాబ్ ఫ్రాడ్స్ మరియు ఇతర విషయాలపై పిర్యాదులు అందాయి.
కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని….
జాబ్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేస్తుండగా ఒక వ్యక్తి పరిచయం అయి ఎయిర్ పోర్ట్ లో తనకు హెల్పర్ గా జాబ్ ఇప్పిస్తామని చెప్పి తన వద్ద నుండి 35 వేల రూపాయలు ఫోన్ పే చేయించుకొని, ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, ఇంకా పదివేల రూపాయలు పంపించు సమాధానం చెపుతానని మెసేజ్ పంపినట్లు, ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని తాళ్లూరు మండలానికి చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు.
ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో దిశా ఇన్స్పెక్టర్ సుధాకర్, డీటీసీ ఇన్స్పెక్టర్ సమీముల్లా, SC/ST సెల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సైలు ప్రభాకర్ రెడ్డి, రజియా సుల్తానా మరియు సిబ్బంది పాల్గొన్నారు.
