తాళ్లూరు మండలంలోని శివాలయాలు కార్తీక శోభ సంచరించుకున్నారు. తాళ్లూరులో గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి, గుంటి గంగలో శివాలయం, శివరామపురంలోని అగస్తీశ్వరాలయం, బొద్దికూరపాడు, మాధవరం, లక్కవరంలలోని శివాలయాలలో వేకువ జాము నుండే భక్తులు ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. మాల ధారులైన స్వాములు ఆయా ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు భక్తులకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేసారు.


