కూటమి ప్రభత్వం ఏర్పడ్డాక ముచ్చటగా మూడో తహసీల్దార్ తాళ్లూరు మండలానికి రానున్నారు. బదిలీల పరంపర జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఇరువురు తహసీల్దార్లు బదిలీపై వెళ్లారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సింగారావు తహసీల్దార్ గా నియమితులైనారు. ఆయన బాపట్ల జిల్లాకు బదిలీ కావటంతో ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న నాగలక్ష్మి అక్టోబర్ 28న బాధ్యతలు చేపట్టారు. అనతి కాలంలోనే ఉత్తమ పనితీరు కనపరచి కార్యాలయంలో నిత్యం పనిపై వస్తున్న రైతులకు మంచి రెవిన్యూ సేవలు అందించారు. తన పరధిలో అవినీతి లేకుండా పాలన సాగించి ఉత్తమ తహసీల్దార్ గా ప్రజలలలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సమయంలో ఎమి జరిగినదో… తెలియదు కాని… మరలా తహసీల్దార్ బదిలీ అయ్యారు. మరలా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఎవో గా పనిచేస్తున్న సంజీవరావును తాళ్లూరు తహసీల్దార్ గా పంపిస్తూ ఉత్వర్వులు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆయన సెలవుపై వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో డిప్యూటీ తహసీల్దార్ గా ఉన్న ఇమ్మానియేల్ రాజును ఇన్చార్జి (ఎఫ్ఎసీ)గా నియమిస్తారా .. లేక మరోకరిని పంపుతారా.. వేచి చూడాల్సి ఉంది.
తాళ్లూరు కు ఐదు నెలల్లో ముచ్చటగా మూడో తహసీల్దార్
04
Nov