సీఎం చంద్ర నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పోరేషన్ లను పునరుద్ధరించాలని జిల్లా మాల మాహానాడు అధ్యక్షుడు దార అంజయ్య కోరారు. తాళ్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దార అంజయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసుల్లో పెండింగ్ లో ఉన్న బడ్జెట్ ను సైతం వెంటను విడుదల చెయ్యాలని కోరారు. అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పూచికత్తుతో ఇచ్చే ఎన్ ఎస్ కె ఎఫ్ డి సి, ఎన్ ఎస్ ఈ ఎఫ్ డి సి పథకాలను కూడ ప్రారంభించాలని కోరారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ఎస్సీ, ఎస్టీ , బీసి నిరుద్యోగ యువతకు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి అవసరమ్యే రుణ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం తెప్పించాలని కోరారు. బ్యాక్ లాగ్ పోస్టులను విడుదల చెయ్యాలని అన్నారు. పథకాలను పునరుద్ధరించి నిథులను విడుదల చెయ్యాలని కోరారు. గత ప్రభుత్వం ఆయా కార్పోరేషన్లకు నిథులు కేటాయించక నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో బంటుపల్లి ప్రకాశ్, జనుమాల వెంకటేశ్వర్లు, రమణయ్య, ఇక శ్రీను తదితరులు పాల్గొన్నారు.
