తాళ్లూరు గ్రామ శివారున దశాబ్దాలకా లంగా నివాసముంటున్న పాములకాలనీ స్థలంలో కొంత బాగం ఆక్రమణకు గురైందని, ఆక్రమణలు తొలగించి పాముల కాలనీ వాసులకు తగు న్యాయం చేయాలని మండల టీడీపీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి తహసిల్దార్ కు విన్నవించారు. తాళ్లూరు తహసీల్దార్ కార్యా లయంలో తాళ్లూరు పాముల కాలనీ వాసుల కష్టాలను తహసీల్దార్ నాగలక్ష్మికి సోమవారం వివరించారు. గత 5 నెలల క్రితమే పాముల కాలనీ వాసుల స్థలంలో ఆక్రమణలు జరుగుతున్నాయని తమ స్థలాన్ని ఆక్రమణ గురి కాకుండా చూడాలని కాలనీ వాసులు ముగ్గురు తహసీల్దార్లకు చెప్పినా న్యాయం జరగలేదన్నారు. ఆక్రమణదారుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డులను పీకి వేసినా పట్టించుకోలేద న్నారు. ఎస్సై తాను ఆక్రమణలు తొలగించలేనని, తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది. తొలగింపు చర్యలు చేపడితే తాము బంధోబస్తు కల్పిస్తామంటున్నారన్నారు. మీరు చొరవ తీసుకుని ఆక్రమణప్రాంతాన్ని తోలగించాలని విన్నవించారు. దీంతో తహసీ ల్దార్ మాట్లాడుతూ ఎస్సైను సంప్రదించి తగు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్య క్రమంలో ఆయన వెంట టీడీపీ ఎస్సీసెల్ మాజీ అధ్యక్షుడు అనపర్తి సుబ్బారావు, పాముల కాలనీ వాసులు ఉన్నారు.
