తాళ్లూరు మండలం లో
సచివాలయంలో ఇంజనీరింగ్ సహాయ కులుగా పని చేస్తున్న తమకు ఎలక్షన్ విధుల్లో భాగంగా బూత్ లెవెల్ (బి.ఎల్. ఓ) అధికారుల భాద్యతలనుండి తప్పించాలని మండలంలోని ఇంజనీరింగ్ సహాయకులు డిప్యూటీ తహసీల్దార్ ఇమ్మానియేల్ రాజు కు విన్నవించారు. సచివాలయ పరిధిలోని ఇంజనీరింగ్ సహాయకులు 7 రకాలవిధులు నిర్వహిస్తూ పని వత్తిడిలో వుండగా, అదనంగా బూత్ లెవెల్ అధికారి డ్యూటీ చేయటం కష్టతరంగా వుంటుందన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో అభివృద్ధిపను లకు ప్రభుత్వం నిధులు విడుల చేసినందున వాటిని నిత్యం పర్యవేక్షించాల్సి వుంద న్నారు. రాష్ట్రపంచాయతీ రాజ్ స్పెషల్ చీప్ సెక్రటరీ, చీప్ ఇంజనీర్లు ఇచ్చిన ఆదేశాల మేరకు మండలంలో పని చేస్తున్న ఇంజనీరింగ్ సహాయకులను బూత్ లెవెల్ అధికారుల విధులనుండి తొలగించాలని డిప్యూటీ తహసీల్దార్ ఇమ్మానియోల్ రాజు కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ సహాయకులు బాపిరెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
