ఉచిత న్యాయ సహాయ సేవలను మహిళలు వినియోగించుకోవాలి….. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా సీనియర్ న్యాయమూర్తి డి.కిరణ్ కుమార్..

పేద మహిళలు, అట్టడుగు వర్గాల ప్రజలు ఉచిత న్యాయ సహాయ సేవలను వినియోగించుకోవాలని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా సీనియర్ న్యాయమూర్తి డి. కిరణ్ కుమార్ అన్నారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా న్యాయమూర్తి , జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్ పర్సన్ వి బాల భాస్కరరావు ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అల్వాల్ సఖి సెంటర్లో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు .ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా సీనియర్ న్యాయమూర్తి డి.కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి మహిళా పారిశుద్ధ్య కార్మికులను ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీ విద్య ఆరోగ్యం మరియు మహిళల ప్రాముఖ్యతను గురించి కింది స్థాయిలో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పి ఎల్ వి ఎస్ డి రాకేష్, లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యులు బి సురేష్ కుమార్, సి డి పి ఓ రోజా , సలోమి సునీత సౌజన్య పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *